ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో ఏపీ బిజెపి పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తూ మోడీ ప్రసంగించారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ... చంద్రబాబు పదే పదే నాకంటే సీనియర్‌నని చెప్పుుకుంటారని, ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో సీనియర్, గతాన్ని మర్చిపోయి మాట్లాడటంలో సీనియర్ అని, మామకు వెన్ను పోటు పొడవడంలో సీనియర్ అని మండిపడ్డారు. సన్ రైజ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదని, చంద్రబాబు సన్ నారా లోకేష్ రాజకీయంగా వృద్ధి చెందడమని మోదీ విమర్శించారు.
దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు వేశారు చంద్రబాబు. లెటర్ ద్వారా చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన గురువు అద్వానీ గారిని వెన్ను పోటు పొడిచింది మోదీ కాదా.. అద్వానీ దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మోదీది.. పైగా చాయ్ వాలా అంటూ కోట్లు విలువచేసే కోట్లు బూట్లు వేసుకుని తిరిగే.. మీరు అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఇక ఏపీకి చెంబుడు మట్టి, నీళ్లు మా మొహాన కొట్టి అన్యాయం చేసిన మోదీ.. మళ్ళీ ఇక్కడికి వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని… గ్యాస్ కనెక్షన్లు మీరిచ్చేది ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం తెచ్చి ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత టీడీపీదే అని చంద్రబాబు తెలిపారు. ఇలా చంద్రబాబు వెన్నుపోటు కామెంట్ పై మోడీ కి గట్టి కౌంటర్ లు వేశారు.