గుంటూరులో ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య సదస్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిందని తీవ్రంగా రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని లేనిపోని కమిటీలు వేస్తూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తున్నారని ప్రతి పథకం లో పర్సంటేజ్‌లు సెట్ చేసుకుని మరీ దోచుకుంటున్నారని మోదీ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ తన అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాల దోచుకుంటూ.. తన కొడుకు అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్నాడని సెటైర్ వేశారు మోదీ. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు విలువలు గురించి మాట్లాడే హక్కులేదని మోదీ ద్వజమెత్తారు. దోచుకున్న ప్రజా ధనంతో ఓట్లు కొనుక్కుంటున్నారని, ఈ నాలుగున్నర ఏళ్ళలో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పనైనా చెప్పగలరా అంటూ మోదీ ప్రశ్నించారు. తండ్రి కొడుకులు చేసిన అవినీతికి టైం దగ్గర పడిందని రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే మాత్రం ఈ రాష్ట్రం మొత్తం దారుణమైన అవినీతికి గురవుతుందని హెచ్చరించారు. కనుక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంది ఓటు వేయాలని మోడీ పిలుపునిచ్చారు.