చంద్రబాబు పై అదిరిపోయే పంచ్ లు వేసిన విజయసాయిరెడ్డి..!

Written By Xappie Desk | Updated: February 11, 2019 11:44 IST
చంద్రబాబు పై అదిరిపోయే పంచ్ లు వేసిన విజయసాయిరెడ్డి..!

వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో దారుణంగా ఏపీ ప్రజలను మోసం చేశారని హోదాకు బదులు ప్యాకేజీ ముద్దు అని తన స్వార్ధ రాజకీయం కోసం ఏపీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని గట్టిగా నమ్మిన నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ అధికారం కోసం హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని యూటర్న్ తీసుకుని నీచాతి నీచమైన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 
అంతేకాకుండా బాబుకు కొత్త ఫోబియా పట్టుకుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్సే కారణమంటాడు. ఈయనకు కేసీఆర్ అన్నా...మోడీ అన్నా వణుకు. అదిగో నాలాగా వాళ్లకు చెమటలు పట్టడం లేదు కాబట్టి అంతా కలిసి పోయారని గుండెలు బాదుకుంటాడు. ఫోబియాల నుంచి బయటపడండి చంద్రబాబు గారూ!`` అంటూ పంచులు కురిపించారు. మొత్తంమీద విజయసాయిరెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో పంచ్ లు వర్షం కురిపించి ఏపీ రాజకీయాలను మరింత వేడిగా మార్చారు.
Top