టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ..?

Written By Xappie Desk | Updated: February 12, 2019 10:32 IST
టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కనీస మెజారిటీ స్థానాలు కూడా గెలవలేదని అప్పట్లో చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేశారు. అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టిడిపి తో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి అర్థమవుతోంది.
 
ఈ నేపథ్యంలో తెలుగుదేశం తో పొత్తు కొనసాగించాలని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ కృతనిశ్చయంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్.పి మదు యాష్కి చెప్పారు. డిల్లీలో చంద్రబాబు దర్నా వద్దకు రాహుల్ గాందీ వెళ్లిన నేపద్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నష్టం చేకూర్చిందన్న వాదనతో తాను ఏకీభవించడం లేదన్నారు. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేయాలని స్థానిక నేతలు కోరుతున్నందునే దరఖాస్తు సమర్పించానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. యూపీలో ప్రియాంక రోడ్‌షోకు జనం కిక్కిరిసి పోయారని, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికీ ఆమెను ఆహ్వానించామని దాసోజు శ్రవణ్‌ చెప్పారు. దీంతో ఇప్పుడు మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top