తెలుగుదేశం పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు..!

Written By Xappie Desk | Updated: February 12, 2019 10:48 IST
తెలుగుదేశం పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు..!

ఇటీవల గత కొంత కాలం నుండి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వైరల్ వీడియో లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. బాలకృష్ణ పై పరోక్షంగా నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో అనేక సంచలనాలు సృష్టించిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలపై మరియు ఒక పార్టీకి కొమ్ముకాసే ఓ వర్గం మీడియా చానళ్లపై కూడా నాగబాబు వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలి పెద్ద దుమారాన్ని రేపరు.
 
ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు మరో సెటైరికల్ వీడియోని ఒకటి వదిలారు. దీనిలో టార్గెట్ గా మాత్రం సైకిల్ ని తీసుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు సైకిల్ ని తొక్కుతుంటారు. కాకపోతే ఒకరు కూర్చొని తొక్కితే మరొకరు సైకిల్ ని పడుకోబెట్టి తొక్కుతారు, ఒకరిని సైకిల్ ఎందుకు తొక్కుతున్నావ్ అని అంటే ఆరోగ్యం కాపాడటానికి అని అంటాడు..మరో పిల్లాడు నువ్వెందుకు ఇలా సైకిల్ తొక్కుతున్నావ్ అని అడిగితే.. ఆ పిల్లడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే సైకిల్ తొక్కే యాలి అంటూ సమాధానం చెబుతారు. ఇదే క్రమంలో ఆ వీడియోలో చివరిలో నాగబాబు ప్రత్యక్షమై ఆరోగ్యం బాగు పడాలంటే సైకిల్ ని తొక్కండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకిల్ తొక్కే యండి అంటూ పిలుపునిస్తారు. మొత్తంమీద నాగబాబు టిడిపి పార్టీని టార్గెట్ చేసి సైకిల్ పై చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతోంది.
Top