బ్రేకింగ్ న్యూస్: వైసిపి పార్టీ మద్దతు కావాలంటున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 12, 2019 10:53 IST
బ్రేకింగ్ న్యూస్: వైసిపి పార్టీ మద్దతు కావాలంటున్న చంద్రబాబు..!

బ్రేకింగ్ న్యూస్: వైసిపి పార్టీ మద్దతు కావాలంటున్న చంద్రబాబు..!
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఆ నాడు ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని చంద్రబాబు చేపట్టిన ఈ దీక్ష జాతీయ స్థాయిలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చనీయాంశం అయింది.
 
ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీ ప్రతిపక్షమైన వైసీపీ కూడా మాతో కలవాలని, వైసీపీ కూడా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే ఉంది కాబట్టి వారు కూడా తమకు మద్దతు తెలపాలని చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ వారు ఒకటో రెండో సీట్లు గెలుచుకుంటే వారు కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి చంద్రబాబు గారు తలపెట్టిన దీక్షకు దేశవ్యాప్తంగా చాలా మద్దతు వస్తుందే చెప్పాలి. ఈ దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు కు మద్దతు ఇస్తున్నారు.
Top