తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తనకు వ్యతిరేకంగా ఆ సమయంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆ సమయంలో జరిగిన మీడియా సమావేశంలో కామెంట్ చేశారు. అయితే ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి వచ్చిన టిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ బెజవాడ ప్రాంతం దుర్గగుడిలో చంద్రబాబుపై సంచలన కరమైన వ్యాఖ్యలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించరు.
ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ పర్యటనకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రెండు రోజుల్లో రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించబోతున్నారు. అదీ రాజకీయ పర్యటన కాదు. గుంటూరు, ద్రాక్షారామంలో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొనడం కోసం ఆయన బుధవారం ఏపీకి వెళుతున్నారు. బుధ, గురు రెండు రోజుల్లో అక్కడే వుంటారు. దీంతో మరోసారి రాజకీయంగా దుమారం రేగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత జనవరిలో ఏపీలో పర్యటించిన తలసాని రానున్న ఎన్నికల్లో తప్పకుండా కలగజేసుకుంటామని, ఏపీలోని బీసీలకు నాయకత్వం వహిస్తామని, ఏపీలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది చంద్రబాబే నని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈయితే మరో దఫా ఏపీలో పర్యటిస్తున్న తలసాని ఈ సారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో అని అంతటా ఆసక్తినెలకొంది. .