మళ్లీ ఢిల్లీకి బయలు దేరుతున్న చంద్రబాబు ఈసారి సంచలనం..!

Written By Xappie Desk | Updated: February 13, 2019 12:29 IST
మళ్లీ ఢిల్లీకి బయలు దేరుతున్న చంద్రబాబు ఈసారి సంచలనం..!

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఢిల్లీలో చేపట్టిన ఈ దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులు పాలు చేసిందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు చేపట్టిన ఈ దీక్షకు జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలు అందరూ మద్దతు తెలిపారు. అయితే ఇటీవల దీక్ష చేపట్టి రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి గల కారణం ఏమిటంటే తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీక్ష చేపట్టబోతున్న ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ దీక్షకు మద్దతు తెలపడానికి చంద్రబాబు మంత్రివర్గ సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ బయలుదేరారు.
 
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి నేడు చంద్రబాబు శంకుస్థాపన చేయాల్సి ఉండగా దాన్ని కూడా గురువారానికి వాయిదా వేశారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఏపీ భవన్‌లో సీఎం దీక్షా శిబిరానికి వచ్చిన కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. మోదీ ఏపీకి ఇచ్చిన విభజన హామీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నారు.
Top