ఏపీ రాజకీయాల్లో సంచలనం ఆ పార్టీ నేత వైసీపీలోకి..?

Written By Xappie Desk | Updated: February 13, 2019 12:35 IST
ఏపీ రాజకీయాల్లో సంచలనం ఆ పార్టీ నేత వైసీపీలోకి..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో సర్వేలు అన్నిటిలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా ఫలితాలు వస్తున్న క్రమంలో చాలామంది ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసిపి పార్టీ లోకి రావడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో విశాఖపట్టణం మొత్తం నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసిపి పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెగ వార్తలు వినబడుతున్నాయి. అయితే ఎన్నికల ముందు విష్ణుకుమార్ రాజు వైసీపీ లోకి వెళ్తే మాత్రం కచ్చితంగా అది జగన్ కి చాలా ప్లస్ పాయింట్ అవుతుందని ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం లో విష్ణుకుమార్ రాజు కి మంచి పట్టు ఉందని ప్రజలలో క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడిగా పేరుందని చాలామంది అంటున్నారు.
 
ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిజెపి పార్టీ మరియు టిడిపి పార్టీలు మోసం చేసిన క్రమంలో బిజెపి పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు వైసిపి పార్టీ లోకి వస్తే ఖచ్చితంగా అది జగన్ కి చాలా ప్రెస్ అవుతుందని సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు మరియు వైసీపీ పార్టీ హైకమాండ్ మధ్య మంతనాలు జరుగుతున్నట్లు త్వరలోనే సరైన సమయంలో విష్ణుకుమార్ రాజు వైసీపీ పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నుండి వస్తున్న సమాచారం.
Top