మోడీ అందుకే నాపై కక్ష కట్టాడు అని అంటున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 13, 2019 14:12 IST
మోడీ అందుకే నాపై కక్ష కట్టాడు అని అంటున్న చంద్రబాబు..!

గత నాలుగు సంవత్సరాలు చట్టాపట్టాలేసుకుని రాజకీయాలు చేసుకున్న మోడీ చంద్రబాబు తాజాగా బద్ధ శత్రువులు గా మారిపోయారు. ఒకపక్క పార్లమెంట్ ఎన్నికలు మరోపక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మోడీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పర్యటనలో చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.
 
దీంతో ఏపీ సీఎం చంద్రబాబు మోడీ తనపై ఎందుకంతగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇటీవల తెలియజేశారు. గతంలో అటల్ బిహారీ ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల విషయంలో చాలామంది దేశంలో ఉన్న నాయకులు మోడీ ప్రభుత్వంపై ముఖ్యంగా మోడీ వ్యవహారంపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ క్రమంలో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మోడీని జన్మలో హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టే ప్రసక్తి లేదని ప్రకటన చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు మనసులో పెట్టుకుని మోడీ తనపై కక్ష కట్టారని..ఈ క్రమంలో రాష్ట్రాన్ని నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఇటీవల మోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ మరియు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
Top