సంచలనం రేపుతున్న ప్రశాంత్ కిషోర్ సర్వే..!

Written By Xappie Desk | Updated: February 13, 2019 14:23 IST
సంచలనం రేపుతున్న ప్రశాంత్ కిషోర్ సర్వే..!

త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త వైసిపి పార్టీ కి రాజకీయ సలహాదారుడిగా ఉన్న ప్రశాంతి కిషోర్ సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు . దీంతో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ మోడీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ ని తప్ప వేరే వారిని ప్రధానిగా దేశ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటి విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు అయితే ప్రస్తుతానికి మాత్రం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం భయంకరమైన ప్రజావ్యతిరేకత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని కానీ రెండు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉందని స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి చాలా బలంగా ఉందని ముఖ్యంగా జగన్ పాదయాత్ర వల్ల పార్టీ చాలా లాభపడిందని ఇందు మూలంగానే అన్ని సర్వేలలో వైసిపి పార్టీ కి మంచి రిజల్ట్ వస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ లో అయితే జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటానికి ఆంధ్ర ప్రజలు తహతహలాడుతున్నారని పీకే తేల్చిచెప్పారు.
Top