జగన్ ప్రజా నాయకుడు చంద్రబాబు ప్రకటనల నాయకుడు..!

Written By Xappie Desk | Updated: February 15, 2019 10:42 IST
జగన్ ప్రజా నాయకుడు చంద్రబాబు ప్రకటనల నాయకుడు..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు శాతం ఓటు తో అధికారం కోల్పోయిన జగన్ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ప్రభుత్వం పై చేసిన పోరాటాలు ప్రజలు క్షుణ్ణంగా గమనించి నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఇదే క్రమంలో ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ విజయం ఖాయమని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు రావడంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు మరియు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని భావిస్తున్న వారు వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి ఉత్సాహపడుతున్నారు.
 
ఈ క్రమంలో ఇటీవల జగన్ హవా కి తెలుగుదేశం పార్టీ కోటగోడలు కూలుతున్న క్రమంలో ఆ పార్టీలో ఉన్న నేతలు వైసిపి పార్టీ కండువా కప్పుకున్నారు ఈమధ్య. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసిపి పార్టీ లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మక్కు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని అంటూ ఎన్నికలు సమీపించినప్పుడు పప్పు బెల్లాల మాదిరిగా కొన్ని పథకాలు ప్రకటిస్తే నమ్మేసి ఓట్లేస్తారని ధీమాతో చంద్రబాబు ఉన్నారని, అయితే రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులని శ్రీనివాస్‌ చెప్పారు.
 
చంద్రబాబు చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు కానీ ప్రజల్లో చైతన్యాన్ని ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. వైఎస్సార్‌ మాదిరిగా జగన్‌కు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎన్ని పథకాలు ప్రకటించినా జగన్‌ విజయాన్ని చంద్రబాబు ఆపలేరన్నారు. చంద్రబాబుకు ఇప్పుడే ప్రజలపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అంతా ఆలోచిస్తున్నారని చెప్పారు. జగన్‌ రూ.2,000 పింఛన్‌ ఇస్తానని నవరత్నాల్లో ప్రకటిస్తే చంద్రబాబు కాపీ కొట్టి అంతే మొత్తాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. మొత్తం మీద అవంతి శ్రీనివాస్ జగన్ ప్రజా నాయకుడు అంటూ చంద్రబాబు ప్రకటనల నాయకుడు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.Top