కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..!

Written By Xappie Desk | Updated: February 15, 2019 10:58 IST
కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..!

జాతీయ రాజకీయాల్లో మోడీకి వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేస్తూ కూటమి ఏర్పాటు చేయడానికి రంగం చేస్తున్న క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమతో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే క్రమంలో మమతా మాట్లాడుతూ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌నూ గౌరవిస్తామన్నారు.
 
వారిద్దరూ విపక్ష కూమటిలో లేరు కదా అని అడిగితే వేచి చూడండి అని ఆమె అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడుతామని తెలిపారు. తమ నేత ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని తేల్చిచెప్పారు. రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఉన్నా లేకుండా జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వామపక్ష పార్టీలు తమతో కలిసి వస్తాయో రావో తెలియదని, ఆ పార్టీలతో మాట్లాడలేదని మమత చెప్పారు.
Top