జగన్ ని కలిసిన టాలీవుడ్ కుర్ర హీరో..!

Written By Xappie Desk | Updated: February 15, 2019 11:02 IST
జగన్ ని కలిసిన టాలీవుడ్ కుర్ర హీరో..!

వైసిపి పార్టీ కి మంచి రోజులు వచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుత పరిణామాలు బట్టి. ఇప్పటికే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వైసీపీ పార్టీ లోకి వస్తున్న తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు వైసిపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రముఖ నటుడు మంచు విష్ణు వైఎస్ ఆర్ కాంగ్రెస్అదినేత, విపక్ష నేత జగన్ ను కలవడం ఆసక్తికరంగా ఉంది.
 
జగన్ ను బందుత్వ రీత్యా కలిశారా? లేక పార్టీపరంగా రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశంతో కలిశారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ కు విష్ణు భార్య వెరోనికా సమీప బందువు అవుతారు. లోట్‌సపాండ్‌ వద్ద ఉన్న జగన్‌ నివాసానికి విష్ణు ఇటీవల సతీసమేతంగా వచ్చారు. జగన్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడకుండానే విష్ణు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఎందుకు కలిసి ఉంటారా అన్నది ఆసక్తికరంగా ఉంది. విష్ణు మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో మోహన్ బాబు రాజకీయాల్లోకి తిరిగి వస్తారని ప్రకటన చేయడం కూడా జరిగింది. ఇటువంటి తరుణంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు జగన్ ని కలవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Top