నీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని అంటున్న ఆమంచి…!

Written By Xappie Desk | Updated: February 15, 2019 11:13 IST
నీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని అంటున్న ఆమంచి…!

ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరిన చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం పై ఆమంచి కృష్ణమోహన్ సంచలన కరమైన ఆరోపణలు చేశారు. మొత్తం ఒకే కులానికి చెందిన విషవలయం చంద్రబాబు చుట్టూ ఉందని ఆయన ఆరోపించారు. ఆయన ఆపీస్ లో నలుగురు ఐఎఎస్ లు ఉంటే ఇద్దరు ఆయన సామాజికవర్గమేనని, పిఎస్ తో పలువరు అదే వర్గం వారని ఆయన అన్నారు. ఎపిపిస్సి చైర్మన్ ముఖ్యమంత్రి వర్గం వారేనని ఆయన చెప్పారు.
 
వివిధ కేంద్ర సర్వీసుల నుంచి ఇరవై మందిని తీసుకుంటే అందులో పదిహేను మంది ఒకే సామాజికవర్గం వారని ఆయన అన్నారు. వెంకటరెడ్డి అనే అదికారికి రెడ్డి అని పేరులో ఉన్నందున ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని కృష్ణమోహన్ సంచలన ఆరోపణ చేశారు. ఇంటిలెజెన్స్ ఆఫీస్ మొత్తం ఒకే కులం వారితో నింపారని, అది చంద్రబాబు సామాజికవర్గం అని ఆయన అన్నారు. మొత్తం మీద ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఇలా తన సామాజిక వర్గానికి చెందిన వారిని నెత్తిన పెట్టుకుని ఇతర వర్గాలకు చెందిన ప్రజలను నాయకులను పక్కన పెడుతున్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఎవరిని అయితే ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను నాయకులను పక్కన పెట్టారు వారే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనది అన్నట్టుగా ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు.Top