చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి కౌంటర్ వేసిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 15, 2019 11:20 IST
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి కౌంటర్ వేసిన చంద్రబాబు..!

ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీ లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ పై కూడా సీరియస్ అయ్యారు. మొత్తం మీద ప్రస్తుతం టిడిపిని వీడుతున్న పార్టీ ప్రతినిధులను చూసి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను కలవరి పెడుతున్నట్లుగా అర్థమవుతుంది.
 
ఇటీవల చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇదంతా కుట్ర అని ఆయన అన్నారు. వారు టిడిపిలో కి వచ్చి మళ్లీ వెళ్లిపోయారని, అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుందామని చెబితే వారు వెళ్లిపోయారని అన్నారు. నేను వారి కోసం పనిచేయాలా. మీకోసం పనిచేయాలా ? అని ఆయన సభికులను ప్రశ్నించారు. పార్టీ ని వీడినవారిని ఓడించాలని ఆయన అన్నారు. ఆ సమయంలో చంద్రబాబు మొహం అంతా తీవ్ర ఆగ్రహంగా కనిపించింది.
Top