జగన్ హయాంలో ఏపీకి రాబోయే వి మంచిరోజులు అంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..!

By Xappie Desk, February 16, 2019 15:07 IST

జగన్ హయాంలో ఏపీకి రాబోయే వి మంచిరోజులు అంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని పాలకులు అవినీతిని పెంచి పోషిస్తున్నారని సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితులు ఎక్కడ కూడా లేవని తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జయ రమేష్. దేశంలోనే మంచి పేరు కలిగి ఉన్న తెలుగు జాతిని నీచం గా మార్చుతున్నారని ఆయన తెలుగుదేశంపై పైర్ అయ్యారు. విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయాలో విలువలు పాటిస్తున్నారని, మాట తప్పని మనిషిగా రాజకీయాలు నడుపుతున్నారని, అది తనకు నచ్చిందని ఆయన అన్నారు.తాను సుదీర్ఘకాలంగా టిడిపిలో ఉన్నప్పటికీ, ఎన్నడూ లబ్ది పొందింది లేదని ఆయన అన్నారు.
 
తాను చంద్రబాబుకు గాని, పార్టీకి కాని ఉపయోగపడ్డానే తప్ప తను ఏ పని చేయించుకోలేదని రమేష్ చెప్పారు. 1999 లో ఎమ్.పి సీటు ఇస్తానని చంద్రబాబు మాట తప్పారని అన్నారు. 2019లో జగన్ ప్రభంజనం వస్తోందని రమేష్ అబిప్రాయపడ్డారు. ఇంత నిక్కచ్చి కలిగిన జగన్ ఏపీ ప్రజలకు మంచి చేయడంలో చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ఖచ్చితంగా తన తండ్రి పాలనను ఏపీ ప్రజలకు గుర్తుచేసేలా జగన్ పరిపాలన ఉంటుందని అంటూ మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని రమేష్ ప్రకటించారు.Top