జగన్ ఇంటిపై తమాషా వ్యాఖ్య చేసిన చంద్రబాబు..!

By Xappie Desk, February 16, 2019 15:10 IST

జగన్ ఇంటిపై తమాషా వ్యాఖ్య చేసిన చంద్రబాబు..!

ఇటీవల వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నవ్యాంధ్ర రాజధాని పరిసర ప్రాంతం తాడేపల్లి లో స్థిర నివాసం మరియు పార్టీ కార్యాలయం నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. తుది దశకు చేరుకున్న ఇంటి నిర్మాణం ఇటీవల ఫిబ్రవరి 14వ తారీఖున గృహప్రవేశం చేస్తున్నట్లు ఏపీ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో వార్తలు బయటకు వచ్చాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ గృహప్రవేశం గురించి ఇటీవల టిడిపి ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న చంద్రబాబు తమాషా వ్యాఖ్యలు చేశారు.
 
గతంలో ఫిబ్రవరి 14న కెసిఆర్ జగన్ గృహప్రవేశానికి వస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు..తాజాగా ఏపీలో నివసించడమే ఇష్టంలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారట. హైదరాబాద్ లో కూర్చుని కెసిఆర్ సహకారంతో అబ్యర్ధులను ఎంపిక చేస్తున్నారని ఆయన అన్నారు. డబ్బులే ఆ పార్టీ టిక్కెట్ కు కొలమానమని కూడా అన్నారట. ఏపీలో అభివృద్ధిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేరని, ఏపీని చూస్తుంటే కేసీఆర్‌కు కూడా కంటగింపుగా ఉందని విమర్శించారని సమాచారం. అయితే మరోపక్క ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇంటిని నిర్మించుకుంటే తప్పులేదుగాని, ఒక ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో జగన్ సొంత ఇల్లు నిర్మించుకుంటే చంద్రబాబుకు అంత బాధ ఎందుకు అని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు కామెంట్లు చేస్తున్నారు.



Top