జగన్ ని ఫాలో అయిపోతున్న చంద్రబాబు..!

By Xappie Desk, February 16, 2019 15:12 IST

జగన్ ని ఫాలో అయిపోతున్న చంద్రబాబు..!

రాజకీయాలలో నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అంటూ కాలర్ ఎగరేసుకుని మాట్లాడే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులు బట్టి తన కంటే చిన్నవాడైన అతి తక్కువ వయసులోనే జాతీయ రాజకీయ నేతలకు చెమటలు పట్టించిన వైసీపీ అధినేత జగన్ ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ ఏ మాత్రం ప్రతిపక్ష నేతగా నిరుత్సాహపడకుండా ప్రజల తరఫున పోరాడుతూ అధికారంలో ఉన్న చంద్రబాబు కి చుక్కలు చూపించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.
 
ఈ క్రమంలో త్వరలో ఏపీ లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్ ప్రకటించిన హామీలన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కాపీ కొడుతూ అవే హామీలను ప్రజలకు ప్రకటిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులందరికీ 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందజేస్తామని ఏడాదిన్నర కిత్రమే వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన నవరత్నాల పథకాల్లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దానిని అమలు చేస్తామని ప్రకటించింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అందించే కరెంట్‌ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు.Top