ఈ విధంగా ప్రచారం చేయండి అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 16, 2019 15:15 IST
ఈ విధంగా ప్రచారం చేయండి అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు..!

ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది నేతలు వైసిపి పార్టీ లోకి వెళ్లి పోవడం తో చాలా నిరుత్సాహంగా ఉన్నారు టిడిపి అధినేత చంద్రబాబు. ఈ క్రమంలో ఒక పక్క ప్రజలతో భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ మారిన నేతలపై విరుచుకుపడుతూ మరోపక్క టిడిపి ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో ఉంటూ అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో అందుబాటులో ఉంటున్నారు.
 
ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో అయితే పార్టీని వీడిన నాయకులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ఈ విధంగా కొత్త నినాదాన్ని అందించారు. రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆగిపోయిన అభివృద్ధి రాష్ట్రంలో మళ్లీ జరగాలంటే తెలుగుదేశం పార్టీయే గెలుస్తుందని ప్రజలకు తెలియజేయాలని ప్రతి బహిరంగ సభలోనూ కార్యకర్తలకు చంద్రబాబు తెలియజేస్తున్నారు. ఇలా ప్రచారం చేయాలని టెలీ కాన్ఫరెన్స్ లో కూడా కార్యకర్తలకు నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కొత్తగా పదవులు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ లతో సమావేశం అయి అవే మాటలు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్‌ చేయడం ఖాయం. అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో మన గెలుపు సునాయాసమే. అయినా ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు కోరారు.
Top