ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇప్పటికే పాదయాత్రతో టీడీపీ అధినేత చంద్రబాబు కి ముచ్చెమటలు పట్టిస్తున్న జగన్ తాజాగా ఆయా జిల్లాలలో బీసీ సమావేశాలు నిర్వహిస్తూ వరాల జల్లులు కురిపిస్తూ మరో పక్క చంద్రబాబు ఏ విధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు వంటి విషయాలను బయట పెడుతూ సంచలన కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏలూరు లో నిర్వహించిన బీసీ గర్జన సభలో జగన్తో పాటు బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అంటే ముఖ్యమంత్రి పదవితో సమానం, ఓటు అంటే ప్రధాని పదవికి సమానం.అది తెల్ల కాగితం..జగన్ కు ఓటు వేయడం ద్వారా ఐదేళ్ల పండగ అవుతుంది. మాట తప్పని వాడు.. మడమ తిప్పనివాడు, రాజశేఖరరెడ్డి నుంచి చూస్తున్నా.. జగన్ కు ఓటు వేయడం ద్వారా బిసిల ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని బిసి సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు ఇచ్చారు. గాడిదకు గడ్డి వేసి ఆవును పాలిమ్మంటే ఇవ్వదు.. అందువల్ల జగన్ కు ఓటు వేయాలని ఆయన అన్నారు. తాను బిసి తీవ్రవాదినని ఆర్.కృష్ణయ్య అన్నారు.
జగన్ అన్న తనను పిలిచారంటే ఆయనలో ఎంత కమిటిమెంట్ ఉందో అర్ధం అవుతుందని ఆయన అన్నారు. ఏలూరు లో భారీ ఎత్తున జరిగిన బిసిల గర్జన సభలో ఆయన మాట్లాడారు. తనను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పిలిచి బిసిల డిమాండ్లు ఏమిటని అడిగారు. దర్మాన ప్రసాదరావు ఆద్వర్యంలో కమిటీని వేశారు. కృష్ణయ్య డిమాండ్లు వేల కోట్లు కావాలని మంత్రులు చెబితే,ఎంత అయినా ఖర్చు పెట్టాల్సిందేనని రాజశేఖరరెడ్డి అన్నారు. కృష్ణయ్య డిమాండ్లు ఎన్నిటినైనా ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. పీజ్ రీయింబర్స్ మెంట్, హాస్టళ్లు , తదితర ఎన్నో సదుపాయాలు వచ్చాయి.
ఈ రోజు గుడిసెలలో ఉన్నవారు కూడా చదువుకోగలిగారంటే అదంతా రాజశేఖరరెడ్డి దయ అని అన్నారు. బిసి ముఖ్యమంత్రులు, దళిత ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలా చేయలేదని ఆయన అన్నారు. చట్టసభలలో ఏభై శాతం రిజర్వేషన్ లు ఉండాలని వైఎస్ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన ప్రశంసించారు. ఆయన అడుగుజాడలలో జగన్ ముందుకు వచ్చారని ఆయన అన్నారు. బిక్ష మెత్తే బతుకులు కాదు.. అధికారం బతుకు కావాలి అని, ఆ వాటా జగన్ ఇస్తానని అంటున్నారు.. దీనిని ఆలోచించాలని కృష్ణయ్య అన్నారు.