చంద్రబాబు ఏ విధంగా బీసీలను మోసం చేస్తారో వంటి విషయాలను బయటపెట్టిన జగన్..!

By Xappie Desk, February 18, 2019 10:59 IST

చంద్రబాబు ఏ విధంగా బీసీలను మోసం చేస్తారో వంటి విషయాలను బయటపెట్టిన జగన్..!

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో నిర్వహించిన బీసీ గర్జన సభలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ లా పరిస్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు జగన్. 2014 ఎన్నికల ముందు అంటే 2012వ సంవత్సరం లోనే చంద్రబాబు బిసిల డిక్లరేషన్ చేసి, తర్వాత ఎన్నికల మానిపెస్టో ప్రవేశ పెట్టారు. కాని చంద్రబాబు బిసి డిక్లరేషన్ కు దిక్కు లేదు అని ఆయన అన్నారు. ఎన్నికలలో మాత్రం నవ్వుతూ పోజు ఇచ్చారు. బిసిలకు 119 హామీలు చేశారు.. ఉదాహరణకు పది హామీలు చదువుతా..పేద పిల్లలకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య..దానికి సబికుల నుంచి అవ్వలేదు..అని బదులు ఇచ్చారు.
 
కాలేజీ విద్యార్దులకు ఐపాడ్.. విద్యా విధానంలో మార్పులు.. పదివేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ అమలు చేస్తా... బిసి సబ్ ప్లాన్ అమలు చేస్తా.. ఇవన్ని గాలికి ఎగిరిపోయాయి అని జగన్ వ్యాఖ్యానించారు. పదివేల కోట్లు ఎక్కడైనా కనిపించాయా అని ప్రశ్నించారు. ఎన్నికలకు నెల రోజుల ముందు సబ్ ప్లాన్ చట్టం గుర్తుకు వచ్చింది అని ఆయన అన్నారు. కేంద్రంలో కూడా 25 శాతం ఉప ప్రణాళికకు ప్రయత్నిస్తానని కూడా చంద్రబాబు చెప్పారని, కాని రాస్ట్రంలో దిక్కులేదని జగన్ అన్నారు. మానిపెస్టోలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లు అని అన్నారు..ఏమైనా చేశారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత ఎన్నికల ప్రణాళికను దగ్గరపెట్టుకుని జగన్ కడిగి పారేశారు.ప్రతి కులాన్ని చంద్రబాబు మోసం చేశాడని, తద్వారా గద్దె ఎక్కి,ఐదేళ్ల తర్వాత మళ్లీ బిసి ప్రణాళిక అని అంటారు.. ఇలాంటి వ్యక్తిని నమ్మగలమా అని జగన్ ప్రశ్నించారు.Top