గతంలో పాదయాత్ర పూర్తయిన తర్వాత లండన్ పర్యటన చేయడానికి తన కూతురుని చూడడానికి షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు వైసిపి పార్టీ అధినేత జగన్. అయితే కొన్ని అనివార్య కారణాల వలన జగన్ లండన్ టూర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది అప్పట్లో. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంపింగులు హవా వైసిపి పార్టీ లోకి కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ పార్టీని దెబ్బ కొట్టడానికి టిడిపి అధినేత చంద్రబాబు సరైన స్కెచ్ వేసినట్లు ఆంధ్ర రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.
ముఖ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది ప్రముఖులు వైసీపీ పార్టీ కండువా కప్పుకున్న క్రమంలో ఎలాగైనా వైసీపీ పార్టీ కి కౌంటర్ వెయ్యాలని సరైన టైం అనగా జగన్ లేని టైం చూసి వైసీపీ పార్టీ కి చంద్రబాబు గట్టి దెబ్బ వేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల టిడిపి పోలిట్బ్యూరో సమావేశంలో కూడా ఈ విషయం గురించి చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి త్వరలో లండన్ వెళ్ళనున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు కూతురు కోసం జగన్ విదేశీ పర్యటనకు వెళుతుండటాన్ని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలో వైసీపీ నుండి వీలైనంతమంది నేతలకు టీడీపీలోకి లాక్కోవడానికి నయా ప్లాన్ రెడీ చేస్తున్నారు చంద్రబాబు అండ్ టీమ్. వైసీపీ నేతలను తమ పార్టీ వైపు తిప్పుకుంటూనే.. టీడీపీలో మొదలైన వలసలు ఆగుతాయని, అందుకు జగన్ లండన్ టూరే సరైన టైమ్ అని టీడీపీ తమ్ముళ్ళు భావిస్తున్నారు.