డైలమాలో ఉన్న జనసేన అధినేత పవన్..!

By Xappie Desk, February 18, 2019 11:04 IST

డైలమాలో ఉన్న జనసేన అధినేత పవన్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపకుండా పోటీ చేయకుండా తటస్థంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభిమానులను జనసేన పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేశారు. ఇదే క్రమంలో త్వరలో ఏపీ లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిస్థితి గతంలో లాగానే ఉంది.
 
ప్రస్తుతమైతే రాబోయే ఎన్నికల్లో పోటీకి పాల్గొనే వారి దగ్గర్నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు పవన్. ఇదే క్రమంలో దరఖాస్తులను వడ పోసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బానే ఉంది. కానీ ఇది అమ‌ల్లోకి వ‌స్తుందా అనేదే పెద్ద డౌట్‌గా ఉంది. ద‌ర‌ఖాస్తు అన‌గానే ఎవ్వ‌రైనా పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉంటారు. మ‌రి ప‌వ‌న్ ఎవ‌రిని ఎన్నుకుంటారు. అస‌లు పోటీ చేయ‌డానికి అర్హ‌త ఏంటీ అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. పోనీ ఈ అంశాన్ని రాజకీయంగా ఎంత వరకూ పనికి వస్తుందనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయి నేత‌ల‌ను నియమించి అభ్యర్థులను ఎంచుకుంటేనే.. అమీతుమీ తేల్చుకోవడం కష్టం. అలాంటిది ఇలా దరఖాస్తులు అంటే అస‌లు ఏమాత్రం వ‌ర్క‌వుట్ అయ్యే అంశం కాద‌నేని విశ్లేష‌కుల మాట‌. మొత్తంమీద పవన్ కళ్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏం చేయలేని స్థితిలో ఉన్నారని డైలమాలో ఉన్నారని చాలామంది రాజకీయ పరిశీలకులు కామెంట్లు చేస్తున్నారు.Top