అందుకే జగన్ బీసీల నామజపం చేస్తున్నారు అంటున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 18, 2019 11:05 IST
అందుకే జగన్ బీసీల నామజపం చేస్తున్నారు అంటున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పార్టీ అధినేత జగన్ పై సంచలన కామెంట్లు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది జగన్ కి దిక్కుతోచడం లేదని ఇందుమూలంగా నే బీసీల నామ జపం చేస్తున్నారని ఈ క్రమంలో బీసీల సభ అంటూ బీసీల సభ ప్లాన్ జగన్ ఆడుతున్న కొత్త నాటకం అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జగన్ బీసీల ఓట్లను కొల్లగొట్టడానికి వేసిన ఎత్తుగడ బీసీ సబ్ ప్లాన్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు.
 
ఇటీవల టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలతో ముచ్చటించిన చంద్రబాబు ఈ కామెంట్లు చేశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు తొలి నుంచి అండగా ఉన్నారన్నారు. బీసీలకు మొదటి నుంచి న్యాయం చేస్తుంది టీడీపీయేనన్నారు. కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వేషన్లను కూడా కల్పించామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీల పట్ల జగన్ చూపుతున్నది కపట ప్రేమఅని చంద్రబాబు అన్నారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి పెద్దయెత్తున తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఏదిఏమైనా రాబోయే ఎన్నికల్లో బీసీల ఓట్లు వేరే పార్టీ వైపు వెళ్ళకూడదు అన్నట్లుగా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
Top