ఏపీలో డోస్ పెంచిన టిడిపి ఎల్లో మీడియా…!

Written By Xappie Desk | Updated: February 19, 2019 15:24 IST
ఏపీలో డోస్ పెంచిన టిడిపి ఎల్లో మీడియా…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఓ వర్గం మీడియా చంద్రబాబు ప్రభుత్వం పై చేస్తున్న ప్రసారాలు ఏపీ ప్రజలకు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఎల్లో మీడియా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన వస్తుందని తెలిసి, కోడ్ అమలులోకి వస్తే రైతులకు ప్రకటించిన అన్నదాత సుఖీబవ పదకం కింద డబ్బులు ఇవ్వడం కష్టమని బావించిన టిడిపి ప్రబుత్వం హడావుడిగా రైతుల ఖాతాలలో వెయ్యి రూపాయలు వేస్తున్నట్లు ప్రకటించింది.
 
కోడ్ విషయం చెప్పకుండా టిడిపి మీడియా అదేదో రైతుల కోసం అన్నట్లు కలరింగ్ ఇస్తూ రెండు రోజులుగా ఎంత డ్రామా నడిపిందో గమనించండి. ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..రైతులకు వెయ్యి రూపాయలు వెంటనే.. రైతులకు పండగే అంటూ శీర్షికలు పెట్టి ప్రచారం చేశాయి. ఆ తర్వాత డబ్బు విడుదల అయింది.. అంటూ మళ్లీ ఇటీవల కూడా బానర్ కదనాలు ఇచ్చారు. ముందుగా రెండువేల ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు వెయ్యి రూపాయలు వేసింది చెప్పకుండా ఇలాంటి ప్రచారాలకు మీడియా దిగడంలో ఆంతర్యం అర్దం చేసుకోవచ్చు. సోమవారం రైతులకు రూ.258.50కోట్లు జమ చేయగా.. మంగళవారం రూ.231 కోట్లు బదిలీ చేయనున్నారు. వివరాలు అన్ని ఉన్నవారికి ముందుగా వేస్తున్నారట. ఓట్ల కొనుగోలుకు జనం డబ్బునే వాడడం అంటే ఇదే కదా! మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతుగా టిడిపి ఎల్లో మీడియా చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రసారాలు చేస్తూ ప్రచారం చేయడం పై మండిపడుతున్నారు ఇతర పార్టీలకు చెందిన నేతలు.
Top