చంద్రబాబు పై మండిపడుతున్న వామపక్ష నేతలు..!

Written By Xappie Desk | Updated: February 19, 2019 15:26 IST
చంద్రబాబు పై మండిపడుతున్న వామపక్ష నేతలు..!

ఎన్నికలు వస్తున్న క్రమంలో ఏపీలో నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష మరియు అధికార పార్టీల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలో తాజాగా వామపక్ష పార్టీ సీపీఐ పార్టీకి చెందిన రామకృష్ణ తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. తినడానికి తిండి లేకున్నా.. వాడుకోవడానికి స్మార్ట్‌ ఫోన్‌లు ఇస్తున్నారని ,ఎన్నికల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు ఆరుగురి సభ్యులకు రాజ్యసభ పదవులు ఇచ్చారని, కానీ వారిలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేరన్నారు. అందరూ అగ్రకులస్తులేనని తెలిపారు. కర్నూల్‌లో కోట్ల కుటుంబం సీఎం చంద్రబాబును అర్థరాత్రి కలవడం.. అదేంటయ్యా అంటే భోజనానికి అని బుకాయిస్తూ, ప్రాజెక్టుల కోసమని చెబుతారని, కానీ కోట్ల అడిగిని ప్రాజెక్టులు.. రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటని అందరికి తెలుసన్నారు. జనసేన, వామపక్షాలు కలిసి ఎన్నికలకి వెళ్తాయని, సీట్ల సర్దుబాటును త్వరలోనే తేలుస్తామని ఆయన చెప్పారు.
Top