జగన్ సభలకు టీడీపీ వణికిపోతుంది అంటున్న అనిల్ కుమార్ యాదవ్..!

Written By Xappie Desk | Updated: February 19, 2019 15:36 IST
జగన్ సభలకు టీడీపీ వణికిపోతుంది అంటున్న అనిల్ కుమార్ యాదవ్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించాక వైసీపీ పార్టీ అధినేత జగన్ కొద్దిపాటి విరామం తీసుకుని తెలుగుదేశం ఓటు బ్యాంకు అయిన బిసి ఓట్లను కొల్లగొట్టడానికి సరైన స్కెచ్ వేస్తూ ప్రతి జిల్లాలో బీసీ గర్జన సభ నిర్వహిస్తూ చంద్రబాబు ఏ విధంగా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు వంటి విషయాలను బయట పెడుతూ వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తుందో వంటి విషయాలను తెలియజేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.
 
సభ గ్రాండ్‌ సక్సెస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి లోనై ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. సభకు జనం రాలేదని, అట్టర్‌ ఫ్లాఫ్‌ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అలా అంటే జనాలు నవ్వుతారని అనిల్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌కు మద్దతుగా బీసీలంతా సిద్ధంగా ఉన్నారని, 2019లో జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ సీఎం అయితేనే టీడీపీ హయాంలో దగాపడ్డ బీసీ సోదరులంతా లాభపడుతారన్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీ.. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదన్నారు. వారి జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు.
Top