బ్రేకింగ్ న్యూస్: జగన్ ని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ..?

Written By Xappie Desk | Updated: February 19, 2019 15:40 IST
బ్రేకింగ్ న్యూస్: జగన్ ని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉండే చాలా మంది ప్రముఖులు కూడా వైసిపి పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల చాలామంది టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు వైసీపీ పార్టీలో చేరారు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండే కుటుంబాలు అయిన దగ్గుబాటి కుటుంబం కూడా ఇటీవల జగన్ చెంతకు చేరడం అందరికీ తెలిసిన విషయమే.
 
అయితే తాజాగా నందమూరి వంశం కి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీ పార్టీ అధినేత జగన్ ని కలిసినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. దీంతో ఈ వార్త బయటకి రావడంతో సహజంగానే చర్చనీయాంశం అయింది. ఎన్.టి.ఆర్.మామ అయిన నార్నె శ్రీనివాసరావు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా సమీప బందువే. ఆయన ఈ సమయంలో జగన్ ను కలవడం సహజంగానే రాజకీయంగా ప్రాదాన్యత ఏర్పడుతుంది. మీడియా శ్రీనివాసరావును దీని గురించి ప్రశ్నిస్తే మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారట.టిడిపి ఎమ్.పి పి రవీంద్రబాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన తరుణంలోనే నార్నె కూడా లోటస్ పాండ్ కు వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. మరి ఇందులో ఏమైనా రాజకీయం ఉందా?లేదా అన్నది తెలియవలసి ఉంది.
Top