మరో ఇద్దరు టీడీపీ నాయకులు పార్టీ వీడబోతున్నారు అని ముందే చెప్పేసిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 19, 2019 15:43 IST
మరో ఇద్దరు టీడీపీ నాయకులు పార్టీ వీడబోతున్నారు అని ముందే చెప్పేసిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జంపింగులు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఫలితాలు రావడంతో అధికార పార్టీ టిడిపి నుండి చాలామంది నాయకులు ఇప్పటికే వైసిపి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో మరో ఒకరిద్దరు టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశముందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తనకున్న సమచారం ప్రకారం మరో ఇద్దరు టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశముందని అన్నారు. ఆయన ఇటీవల తెలుగుదేశంపార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఈ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.
 
జగన్, కేసీఆర్ కుమ్మక్కై టీడీపీ నేతలను తీసుకెళుతున్నారన్నారు. హైదరాబాద్ లో ఆస్తులున్న వారిని భయపెట్టి మరీ పార్టీ మారేలా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ టీడీపీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. సరిహద్దు రాష్ట్రాలను మోదీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సరిహద్దుల్లో జవాన్లకు టీడీపీ అండగా ఉంటుంది కాని, రాజకీయం చేసే బీజేపీని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని చెప్పారు. ఎవరు ఎటు వెళ్లినా గాని చివరాఖరికి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని తెలుస్తుందని ప్రజల్ని ఎవరు మోసం చేయలేరని చంద్రబాబు పేర్కొన్నారు.
Top