కెసిఆర్ జగన్ ను కలిపి కుమ్మక్కు రాజకీయాలు అంటూ కామెంట్లు చేసిన ఏపీ మంత్రి..!

Written By Xappie Desk | Updated: February 20, 2019 15:28 IST
కెసిఆర్ జగన్ ను కలిపి కుమ్మక్కు రాజకీయాలు అంటూ కామెంట్లు చేసిన ఏపీ మంత్రి..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కెసిఆర్ జగన్ లు కలిపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని హైదరాబాదులో ఆంధ్ర రాజకీయ నేతల వ్యాపారాలను అడ్డం పెట్టుకుని ఇక్కడున్న రాజకీయ నేతలను టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగన్ లాభం కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలంగాణ సిఎం కెసిఆర్‌పై, వైఎస్‌ఆర్‌సిపి పార్టీ అధినేత జగన్‌లను విమర్శించారు.
 
ఏపిపై వార్ద్దిరు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమలాపురం ఎంపీ ర‌వీంద్రబాబువి నైతిక విలువ‌లు లేని రాజ‌కీయాలు అని మండిపడ్డారు. స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారన్నారు. కెసిఆర్‌, కెటిఆర్‌ వీళ్లతో మాట్లాడి పార్టీ మార్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే కెసిఆర్‌ ,కెటిఆర్‌ ఏపీకి వ‌చ్చి.. జ‌గ‌న్‌తో క‌లిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇక కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి జ‌గ‌న్‌.. మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. బీసీల గురించి జ‌గ‌న్ మాట్లాడ‌డం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.
Top