ఉద్యోగస్తులకు శుభవార్త తెలియజేసిన జగన్…!

Written By Xappie Desk | Updated: February 20, 2019 15:32 IST
ఉద్యోగస్తులకు శుభవార్త తెలియజేసిన జగన్…!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి మరింత ఉత్కంఠభరితంగా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా గత ఎన్నికల మాదిరిగానే రెండు పార్టీల మధ్య ఎక్కువ పోటీ ఉంది. రాబోయే ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్టుగా వైసిపి మరియు టిడిపి పార్టీ ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తే ఎక్కడా కూడా అత్యుత్సాహం చూపకుండా కష్టపడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి చుక్కలు చూపిస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా వైసీపీ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు రావడంతో వైసీపీ పార్టీ శ్రేణులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
 
ఇదే క్రమంలో పాదయాత్ర ముగించుకుని జగన్ ఇటీవల అనేక బీసీ సభలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతిలో నిజాయితీ లేదని అన్నారు. భృతి ఇప్పుడు ప్రకటించి జూన్‌లో ఇస్తామనడం మోసమేనని వ్యాఖ్యానించారు. తనకు అధికారంలేని బడ్జెట్‌పై బాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు, దేవుడి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేది తమ ప్రభుత్వంలోనే అని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.
Top