నా పై పగ పట్టారు అని అంటున్నా రేవంత్ రెడ్డి..!

Written By Xappie Desk | Updated: February 20, 2019 15:38 IST
నా పై పగ పట్టారు అని అంటున్నా రేవంత్ రెడ్డి..!

తెలుగు రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసు ఎన్ని సంచలనాలు సృష్టించింది మనకందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే జరిగిన ఎన్నికలలో రేవంత్ రెడ్డి దారుణంగా ఓడిపోవడంతో గత రెండు నెలలుగా క్రియాశీల రాజకీయాల లో ఎక్కడా కూడా కనబడలేదు. ఇదిలా ఉండగా ఓటుకు నోటు కేసులో ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డిని బుదవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు.
 
విచారణ తర్వాత ఆయన యదా ప్రకారం తెలంగాణ ప్రభుత్వంపై న ముఖ్యమంత్రి కెసిఆర్ పైన విమర్శలు చేశారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. బుధవారం కూడా మళ్లీ విచారణకు రమ్మన్నారు. విచారణకు హాజరై అన్ని సమాధానాలు చెబుతా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై శాసనసభ ఎన్నికలప్పుడు కూడా నాపై ఐటీ అధికారులను ప్రయోగించారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ ఇప్పుడు ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష్య సాధింపు. అని ఆయన ఆరోపించారు.
Top