సెన్సేషనల్ జగన్ ని కలిసిన కింగ్ నాగార్జున…!

Written By Xappie Desk | Updated: February 20, 2019 15:42 IST
సెన్సేషనల్ జగన్ ని కలిసిన కింగ్ నాగార్జున…!

ఏపీ రాజకీయ ముఖచిత్రం క్షణక్షణానికి మారిపోతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న చాలా మంది కొత్తవారు ప్రముఖులు ఎక్కువగా వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వైసిపి పార్టీకి మద్దతు తెలిపిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో..ఎక్కువవుతున్నాయి… తాజాగా వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో కలిశారు.
 
అనూహ్యమైన వీరి కలయిక రాజకీయంగా సంచలనం రేపుతోంది. దాదాపుగా వీరు గంట సేపు మాట్లాడుకున్నారు. కాగా నాగార్జున వైసీపీ తరపున గుంటూరు నుండి పోటీ చేస్తారని, అందుకోసమే జగన్ ని కలిసారని వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. వీరి భేటీ తరువాత నాగార్జున మీడియా తో మాట్లాడకుండానే వెళ్లిపోయారు… నాగార్జున నే కాకుండా మరొక సినీ నటుడు మోహన్ బాబు కూడా వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీకి దిగుతారని సమాచారం.
Top