త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న క్రమంలో దేశంలో జాతీయ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీని ఎలాగైనా గద్దె దించాలని జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీల కూటమిగా ఏర్పడి విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పుల్వామా జరిగిన దాడి ఘటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ దాడి విషయమై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పాకిస్తాన్ ను సమర్దించేలా ఉన్నాయని మాజీ సి.ఎస్, బిజెపి నేత ఐవై ఆర్ కృష్ణరావు విమర్శించారు. ఆయన ఈ విషయమై గవర్నర్ కు పిర్యాదుచేశారు. జాతీయ స్థాయి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అన్నారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు నిరాధార వ్యాఖ్యలు చేశారని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, జాతికి క్షమాపణ చెప్పాలని ఐవైఆర్ కృష్ణారావు కోరారు. బాధ్యతగల పదవిలో ఉండి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు.