జగన్ పై సంచలన కామెంట్లు చేసిన వంగవీటి రాధ..!

Written By Xappie Desk | Updated: February 22, 2019 11:08 IST
జగన్ పై సంచలన కామెంట్లు చేసిన వంగవీటి రాధ..!

ఇటీవల వైసీపీ పార్టీ నుండి బయటకి వచ్చి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న విజయవాడ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత వంగవీటి రాధా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కుల రాజకీయాల గురించి మరియు విపక్ష పార్టీ నేత జగన్ కి కుల పిచ్చి ఉందని సంచలన కామెంట్ చేశారు. వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు అవమానం చెందానని ఆవేదన వ్యక్తం చేశారు రాదా.
 
ఇంకా మాట్లాడుతూ పార్టీలో చేరిన తొలినాళ్ల నుంచి త‌న‌ని అణ‌చివేసే కుట్ర చేశార‌ని జ‌గన్ పై ఆరోపించారు. త‌న‌ని మెడ ప‌ట్టి గెంటేయాల‌ని చూశారు. అందుకే నేను గౌర‌వంగా త‌ప్పుకున్నాన‌ని అన్నారు. ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధా త‌న‌లోని భావోద్వేగాన్ని బ‌హిరంగంగానే బ‌య‌ట‌పెట్టారు. సెప్టెంబ‌ర్ 11న విశాఖ‌లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలోనే త‌న బ‌హిష్క‌ర‌ణ‌కు ముహూర్తం కుదిరింద‌ని ఆరోపించారు. వైసీపీ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా, సిటీ అధ్యక్షుడిగా, చివరకు నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు కట్టబెట్టి ఆ తర్వాత ఆ పదవులను లాక్కొన్నారని.. యూత్ వింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినా కనీసం కమిటీ ఏర్పాటు చేసుకోకుండా అడ్డుకొన్నారని తెలిపారు. ముద్ర‌గ‌డ ఉద్య‌మానికి ముందే తాను ఆ ప‌ని చేస్తాన‌ని కోరితే జ‌గ‌న్ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని తెలిపారు. దీంతో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top