ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో సర్వేలలో పేరుగాంచిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే దారుణంగా విఫలం చెందడంతో మీడియా ముందు ముఖం చూపించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ గ్రామంలో ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాబోతున్న ఎన్నికల విషయమే స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరుపున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశం వుందని పలు మార్లు వెల్లడించిన లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం మాట మార్చారు.
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాను ఏ పార్టీ నుంచి పోటీకి దిగడం లేదని క్లారిటీ ఇచ్చారు. జి.కోడూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీదగ్గుమల్లి భారతి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆమెతో పాటు మునగపాడులో అనారోగ్యంతో మృతి చెందిన మైలవరం కోరనా భిక్షమేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన రావడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో వచ్చిన ఫలితాలు లగడపాటి రాజగోపాల్ నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇప్పటికికూడా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.