జగన్ అందుకే లండన్ వెళ్ళాడు అని అంటున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 23, 2019 13:02 IST
జగన్ అందుకే లండన్ వెళ్ళాడు అని అంటున్న చంద్రబాబు..!

వైసిపి పార్టీ అధినేత జగన్ లండన్ పర్యటన ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న క్రమంలో జగన్ విదేశీ పర్యటన గురించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా జ‌గ‌న్ లండ‌న్ టూర్ పై వ్యాఖ్య‌లు చేశారు. హ‌వాలా డ‌బ్బుకోసమే జ‌గ‌న్ లండన్ వెళ్ళార‌ని చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా టీడీపీ నేత‌ల‌తో ఏర్పాటు చేసిన టెలీకాన్ఫ‌రెన్స్ స‌మావేశంలో మాట్లాడిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ హ‌వాలా డ‌బ్బుల కోస‌మే అని స్ప‌ష్టం చేశారు. ఇక‌ ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు ఎలా వెళ‌తార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నీ పూర్తి చేశామ‌ని బీజేపీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని, అబ‌ద్దాలు చెప్ప‌డంలో బీజేపీ నేత‌లు డిగ్రీలు పొందార‌ని బాబు అన్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేని కెసిఆర్ కి జగన్ సహకరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తన స్వార్ధ రాజకీయాలకోసం మోడీ మరియు కేసీఆర్ తో జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Top