చంద్రబాబు పాలన పై సంచలన కామెంట్స్ చేసిన ఉండవల్లి..!

Written By Xappie Desk | Updated: February 25, 2019 11:11 IST
చంద్రబాబు పాలన పై సంచలన కామెంట్స్ చేసిన ఉండవల్లి..!

ఇటీవల ప్రజా చైతన్య వేదిక పేరుతో సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్ లపై ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మరియు మాజీ చీఫ్ సెక్రటరీ అజ‌య్ క‌లాం చంద్రబాబు నాయుడు పై సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సదస్సులో పాల్గొన్న అజ‌య్ క‌లాం.. అరుణ్ కుమార్ తమదైన శైలిలో చంద్రబాబు పాలన పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఉండ‌వ‌ల్లి, అజ‌య్ క‌లాం లెక్కలతో సహా చెప్పారు. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నిర్ణయాలేనని ఈ ఇద్ద‌రు తేల్చిచెప్పారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ప్రజలు సాగనంపాలని పిలుపునిచ్చారు. పోలవరం నుంచి, రాజధాని వరకు అంతా అవినీతి మయంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేభ‌వం ఉన్న‌వాడు అని అధికారం క‌ట్ట బెడితే.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశనం చేశార‌ని మండి పాడ్డారు. అందుకే సేవ్ ఎపి, సేవ్ డెమోక్రసీ పేరుతో రాష్ట్ర ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక‌వైపు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, మ‌రోవైపు అజ‌య్ క‌లాం, ఇద్ద‌రూ లెక్కలతో సహా ఏపీ సర్కార్ తప్పులను ఎత్తి చూపడ‌మే కాకుండా, మ‌రోసారి ఇలాంటి ప్ర‌భుత్వాన్నికి అధికారం ఇవ్వొద్ద‌ని చెప్ప‌డంతో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. మ‌రి టీడీపీ త‌మ్ముళ్ళ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.
Top