కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీరియస్ ఐన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: February 25, 2019 11:17 IST
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీరియస్ ఐన చంద్రబాబు..!

ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో వైసీపీ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరందరూ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ లు వేశారు. ఎవరు ఎంత మంది కుమ్మక్కు అయినా కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. మీరు చేస్తున్న చీకటి రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని కేటిఆర్ కి గట్టి కౌంటర్ లు వేశారు. అంతేకాకుండా కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు అబద్ధపు హామీలు అంటే చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు బాబు. తోటి తెలుగు రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేని మీరు విమర్శించే హక్కు లేదని కేటీఆర్ పై మండిపడ్డారు. ఇకపోతే జగన్ రాజకీయాలను నేరమయం చేశారని, జనసేన, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని, రాష్ట్రంలో రౌడీయిజం సహించేదిలేదన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఎవరూ కులముద్ర వేయలేదని, ఇప్పుడు జగన్ ఆ సాహసం చేస్తున్నారన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ ఏపీని మరో బీహార్ చేయాలని చూస్తున్నారని, బీహార్ రాజకీయాలు ఏపీలో చెల్లవని, జగన్, ప్రశాంత్ కుప్పిగంతులు నాదగ్గర పనిచేయవని చంద్రబాబు అన్నారు.
Top