ప్రధాని సభకు సహకరించని ఆంధ్ర యూనివర్సిటీ..!

By Xappie Desk, February 25, 2019 11:23 IST

ప్రధాని సభకు సహకరించని ఆంధ్ర యూనివర్సిటీ..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మంచి రంజు మీద ఉంది. ఒకసారి ఎన్నికల రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ బీభత్సంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జత కలిసి పాల్గొన్న బిజెపి పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్శిటీ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించడం విశేషం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అక్కడ సభలు జరిగినా అనుమతించిన యూనివర్శిటీ ఇప్పుడు ఏదో ఒక సాకు చూపి ప్రధాని సభకు అనుమతి ఎలా నిరాకరిస్తుదని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై గవర్నర్ నరసింహన్ కార్యాలయం వాకబ్ చేసిందని కథనం. అయితే గతంలో దీనికి సంబంధిచిన ఒక సర్కులర్ ఇచ్చారని, రాజకీయ, మతపరమైన సభలకు అనుమతి ఇవ్వరాదని ఉన్నత విద్యామండలి అందులో తెలిపిందని యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ నాగేశ్వరరావు అన్నారు. ప్రధాని కార్యక్రమం ప్రభుత్వపరంగా కాకుండా పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమం అవడం వల్ల అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. మొత్తంమీద ప్రధాని సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిణామం ఎదురవ్వడంతో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.Top