చంద్రబాబు లోకేష్ బెదిరిపోతున్నారు..!

Written By Xappie Desk | Updated: February 26, 2019 12:22 IST
చంద్రబాబు లోకేష్ బెదిరిపోతున్నారు..!

చంద్రబాబు లోకేష్ బెదిరిపోతున్నారు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఏపీ రాజకీయం క్షణక్షణానికి మారిపోతూ రసవత్తరంగా ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ తెలుగుదేశం మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీల మధ్య గత ఎన్నికల మాదిరిగానే పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం జాతీయ సర్వే లలో మరియు కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల్లో వైసిపి పార్టీ కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలవడం ఖాయం అని జగన్ ముఖ్యమంత్రి అవడం తథ్యమని ఫలితాలు వస్తున్న క్రమంలో చాలా మంది అధికార పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లకు ఆత్మ విశ్వాసం లేదని విజయసాయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఒక ట్వీట్ చేస్తూ, గెలుస్తామనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు దేనికీ భయపడరని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విజయాన్ని అడ్డుకోలేరని ధైర్యంగా చెప్పుతారని, పతనం తప్పదని గ్రహించిన వాళ్లే ఇతరులపై ఏడుస్తారన్నారు. ‘అదిగో వాళ్లెవరెవరో కలిసి పోయారు. చూశారా ఆయన్నుఈయన తిట్టడం లేదు.
 
కుట్ర పన్నుతున్నారంటూ క్షణక్షణం వణికిపోతుంటారు’ అని పేర్కొన్నారు. ఇక కమీషన్ల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మెస్తున్నాడని మండిపడ్డారు. కేజీ బేసిన్‌ గ్యాస్‌ను ఏపీ గ్యాస్‌ కార్పోరేషన్‌ను కాదని, రిలయన్స్‌కు అప్పగించి లక్షల కోట్ల నష్టం కల్గించాడని, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రభుత్వ రంగ హెచ్‌పీసీఎల్‌ను కాదని హల్దియా పెట్రో అనే కంపెనీకి 15వేల కోట్ల రాయితీలిస్తున్నాడని తెలిపారు.
Top