చంద్రబాబు ప్రధాని మోడీ కి వెన్నుపోటు పొడిచారు..!

By Xappie Desk, February 26, 2019 12:26 IST

చంద్రబాబు ప్రధాని మోడీ కి వెన్నుపోటు పొడిచారు..!

చంద్రబాబు ప్రధాని మోడీ కి వెన్నుపోటు పొడిచారు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన బిజెపి టిడిపి పార్టీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నట్టు గా పరిస్థితులు నెలకొన్నాయి. 2014 ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఒకరి పార్టీపై మరొక పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రం అవినీతి మయం అవ్వటానికి కారణం మీరే అంటే మీరు అన్నట్టుగా ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బిజెపి వల్ల, మోడీ నాయకత్వం వల్లే టిడిపి అదినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభంజనం లేకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఉండేది కాదని ఆయన అన్నారు. గుంటూరులో మేదావుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత సారి చంద్రబాబు గెలవకపోతే జైలులోనే ఉండేవారని ఆయన ఎద్దేవ చేశారు. 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయిని, అంతకు ముందు మామ ఎన్టీఆర్‌ను, ప్రస్తుతం మోదీని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన ద్వజమెత్తారు. ఇంతటి దారుణమైన రాజకీయ వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబునాయుడికి రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నట్లు పేర్కొన్నారు.Top