పవన్ కళ్యాణ్ ఎదురుగానే జగన్ సీఎం అని తేల్చేసిన ఓ రైతు..!
మొన్నటి వరకు కోనసీమ జిల్లా ప్రాంతాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రాయలసీమ ప్రాంతం పై దృష్టి పెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీని పటిష్ట పరుస్తూ ఏపీ లో ఉన్న రెండు ప్రధాన పార్టీలకు దీటుగా తాను స్థాపించిన జనసేన పార్టీని తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో వేదికపై మాట్లాడిన ఓ రైతు పవన్ కళ్యాణ్ కి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో జగనే సీఎం అవ్వాలని ఆయన వస్తేనే ప్రజలు రైతులు బాగుపడతారని ఏ మాత్రం భయం లేకుండా పవన్ కళ్యాణ్ ముందు.. వేదికపై మాట్లాడారు రైతు. ఇలాంటి సన్నివేశాలు సహజంగానే ఎవరికైనా ఇరకాటంగానే ఉంటాయి. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నిశ్చేష్టుడై చూడాల్సి వచ్చింది. ఆదోని పత్తి మార్కెట్ యార్డులో రైతులతో పవన్ ముఖాముఖి జరిపినప్పుడు ఒక రైతు జగన్ సి.ఎమ్. కావాలని అనడంతో ఆయన , అక్కడ ఉన్న మరో నేత నాదెండ్ల మనోహర్ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఒక రైతును మాట్లాడాలని పవన్ పిలిచి మైక్ ఇచ్చారు. ఆ వృద్ద రైతు మాట్లాడుతూ 'కోతకు సిద్దంగా ఉన్న పత్తిపంట వర్షం రావడంతో నానిపోయింది. పశువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పశువులు లేని ది ప్రపంచం లేదు. ఏ ఉద్యోగస్తులు లేరు' అని రైతు తన బాధలు చెప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భజం పై చేయి వేసి మరీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని చెప్పారు. ఆయన మాటలకు ఆ సభలో పలువురు హర్షధ్వానాలు చేయడం విశేషం. ఈ ఘట్టానికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.