పవన్ కర్నూలు పర్యటన ఇచ్చిన షాక్ లో ప్రత్యర్థులు!

Written By Xappie Desk | Updated: February 26, 2019 15:01 IST
పవన్ కర్నూలు పర్యటన ఇచ్చిన షాక్ లో ప్రత్యర్థులు!

పవన్ కర్నూలు పర్యటన ఇచ్చిన షాక్ లో ప్రత్యర్థులు!
 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి అతని ఉనికి ఏయే ప్రాంతాలపై ఉండొచ్చు అన్న చర్చలో చివరి వరుసలో నిలిచే ప్రాంతం రాయలసీమ. అయితే తాజాగా జరిగిన అతని కర్నూలు పర్యటన అందుకు పూర్తి భిన్నంగా మారింది. అక్కడ అతనికి లభించిన మద్దతు, జనసందోహం చూసి యావత్తురాష్ట్రం నివ్వెరపోయింది. ఇతర పార్టీ నేతలైతే ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేకున్నారు.
 
పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్ తాను అనంతపూర్ నుండి పోటీ చేస్తా అని చెప్పిన సందర్భంలో హేళన చేసిన వారంతా ఇప్పుడు తీవ్ర ఆలోచనలో పడ్డారు. నిజానికి పవన్ కళ్యాణ్ పర్యటన గుంటూరు, నెల్లూరు జిల్లాల మీదుగా రాయలసీమ లోకి రావాల్సిఉందట. అయితే ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో అతను కర్నూలుకు బయలుదేరడం, అశేష ప్రజా అతనికి నీరాజనాలు పలకడం, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టడం త్వరత్వరగా జరిగిపోయాయి. దీనిని బట్టి చూస్తుంటే జనసేన పార్టీ చాలా రోజులనుండి రాయలసీమ సెక్టార్ మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
మామూలుగా జనసేన పార్టీకి వచ్చే సీట్లలో సింహభాగం కోస్తా ప్రాంతంలో అది కూడా గోదావరి జిల్లాల కూడలి లో నుండి అన్నది అందరి మాట. ఎన్నో ఏళ్లుగా రాయలసీమ వైయస్సార్ కంచుకోటగా ఉంటూ వచ్చింది. క్రితం సారి ఎన్నికల్లో బాబు అక్కడక్కడా ప్రభావం చూపించారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలోని సీట్లను క్లీన్ స్వీప్ చేస్తారని ముందస్తు సర్వేలు చెప్పాయి.
 
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజా పర్యటన ఈ రెండు ప్రధాన పార్టీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమలో ఒక మోస్తరు ఓట్ల లేదా కొన్ని సీట్లు గెలిచినా జనసేన పార్టీ పునాదులు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఇప్పుడు పవన్ దెబ్బతో తెదేపా మరియు వైకాపా నేతలు ఆయా ప్రాంతాల్లో తమ పట్టు పెంచుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారట. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన పర్యటనలతో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ కర్నూలు ప్రజల నుండి వచ్చిన స్పందనతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పవన్ మొన్న ట్విట్టర్ లో చెప్పినట్లుగానే తాను రాజు కాకపోయినా ఒక పావులా, యుద్దానికి సిద్ధమైన ఒక సైనికుడిలా ఉన్నాడు అన్నది అందరి మాట.
Top