దేనికైనా రెడీ అని అంటున్న పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: February 27, 2019 11:56 IST
దేనికైనా రెడీ అని అంటున్న పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి తాను చిన్ననాటినుండే రావాలని కోరుతున్నాం అని సమసమాజం కోసం చిన్ననాటి నుండే కలలు కనే వాడినని ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తాను ముఖ్యమంత్రి అవుతానని మరియు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని..కానీ నేను మాత్రం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.
 
అంతేకాకుండా రాయలసీమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. మన దగ్గర కిరాయి మూకలు లేవని, ప్రైవేటు సైన్యం లేదని, కాని ప్రైవేటు సన్యాన్ని ఎదుర్కోగలిగే జనసేనికులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం చేయలేరని కొందరు అంటుంటారని, వారికి సవాల్ చేస్తున్నానని, మీరు నిలబడతారా? నేను నిలబడతారా అన్నది చూస్తానని ఆయన అన్నారు. అన్నిటికి సిద్దపడే వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. వర్గ, ప్యాక్షన్, కుటుంబ రాజకీయాలలో మార్పు తెస్తానని , ఒకరోజులోనా, అంచెలంచెలుగా వస్తుందా అన్నది తెలియదు కాని, భవిష్యత్తు తెస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకటి రెండు కులాలకు కాకుండా అన్ని కులాలకు ప్రాతినిద్యం ఉండాలని ఆయన అన్నారు.




Top