సంచలన సవాలు ఎదుర్కోబోతున్న కేటీఆర్..!

Written By Xappie Desk | Updated: February 27, 2019 12:00 IST
సంచలన సవాలు ఎదుర్కోబోతున్న కేటీఆర్..!

సంచలన సవాలు ఎదుర్కోబోతున్న కేటీఆర్..!
 
తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ త్వరలో రాబోతున్న లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న కెసిఆర్ జాతీయస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ రింగ్ చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలను గెలవడం కీలకం కనుక ఈ బాధ్యతలను కేటిఆర్ కి అప్పగించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు విషయంలో కీలకంగా మారిన కేటీఆర్ ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు ఎన్టీఆర్ నాయకత్వంలో గెలుచుకుంది.
 
దీంతో కెటిఆర్ కు వచ్చే లోక్ సబ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఆయన రాజకీయ భవిష్యత్తుకు అవి కీలకం అవుతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహాత్మకంగానే సీనియర్ నేత హరీష్ రావును,కెటిఆర్ ను మంత్రులు చేయలేదని చెబుతున్నారు. హరీష్ రావును జహీరాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేయించవచ్చని చెబుతున్నారు. అలాగే కసిఆర్ మెదక్ , నల్గొండ, కరీం నగర్ లలో ఏదో ఒక చోట నుంచి లోక్ సభకు పోటీచేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కొందరు దేశానికి కెసిఆర్ ప్రదానమంత్రి కావాలని అంటున్న సంగతిని కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ నేపద్యంలో కెటిఆర్ లోక్ సభ ఎన్నికల బాద్యతను చేపట్టారు. ఆయా జిల్లాలో ప్రణాళికలు కూడా సిద్దం చేస్తున్నారు. కేంద్రంలో పరిస్తితులు అనుకూలిస్తే కెసిఆర్ డిల్లీకి వెళితే, అప్పుడు కెటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఈ లోక్సభ ఎన్నికలను చాలా సవాలుగా తీసుకోబోతున్నారు కేటీఆర్.
Top