జగన్ కొత్త ఇంటిలో ఎంట్రీ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు..!
మొన్నటివరకు హైదరాబాద్ కేంద్రంగా లోటస్ పాండ్ నుండి పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టిన వైసీపీ అధినేత జగన్ తాజాగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో ప్రవేశించారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి జగన్ తాజాగా ఇటీవల గృహ ప్రవేశం చేశారు. ఇదే క్రమంలో ఇంటి పక్కనే వైసిపి కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వైసీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొత్త ఇంటి లో ప్రవేశించిన క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు దారుణమైన కామెంట్లు చేశారు. జగన్ ప్యాలెస్‌లో తప్ప మరోచోట ఉండలేరా.. రాజధాని విషయంలో వైసీపీ అపోహలు సృష్టిందని బాబు అన్నారు. నాలుగేళ్ల నుంచి రాజధాని అమరావతిలోనే ఉంటే ఇప్పుడు ఆ అంశాన్ని వైసీపీ మ్యానిఫేస్టోలో పెట్టడ విడ్డూరమని చంద్రబాబు మండి పడ్డారు.
ఇక పులివెందుల, బెంగళూరు, హైదరాబాద్‌లతో పాటు విజయవాడలో కూడా జగన్ ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని.. ఎక్కడకు వెళ్లినా రాజప్రసాదాల్లోనే జగన్ బస చేస్తుంటారన్నారని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్ని టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలకు నాయకులకు తెలియజేసి ప్రజల్లో ఈ విషయాలను బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.