ఇప్పటి నుండి జగన్ టైం స్టార్ట్ అయ్యింది..!

By Xappie Desk, February 27, 2019 12:10 IST

ఇప్పటి నుండి జగన్ టైం స్టార్ట్ అయ్యింది..!

ఇప్పటి నుండి జగన్ టైం స్టార్ట్ అయ్యింది..!
 
ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు గమనిస్తుంటే గతంలో 2014 ఎన్నికల సమయంలో కొద్దిపాటి తేడాతో అధికారంలోకి కోల్పోయిన జగన్..రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రంలో తాను చేసిన పోరాటాలు మరియు పాదయాత్రలు మంచి ఫలితాన్ని పార్టీకి మైలేజ్ ని తెచ్చి పెట్టాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రజ పక్షంలో ఉన్న శాసన సభ్యులను 24 మందిని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై జగన్ ఎన్నిసార్లు అసెంబ్లీలో ప్రశ్నించిన అధికార పార్టీ నుండి సరైన జవాబు రాకపోవడంతో ప్రజల నే నమ్ముకున్న జగన్ ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగాడు.
 
దీంతో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని గమనించిన ప్రజలు తమ కోసం పోరాడుతున్న జగన్ కష్టాన్ని కూడా గుర్తించడంతో అదే సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో చాలామంది భవిష్యత్తు రాజకీయాలు రాణించాలని చూస్తున్న వారు వైసీపీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీ నేతలు కూడా వైసిపి పార్టీ వైపు చూడడం విశేషం. దీంతో ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సీనియర్ రాజకీయ నేతలు గతంలో చంద్రబాబు టైం నడిస్తే...ఇప్పుడు జగన్ టైం స్టార్ట్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.Top