చంద్రబాబు ఫేక్ సర్వేలతో గెలవడం నీ వల్ల కాదు అంటున్న వైసిపి..!
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో అధికారంలో ఉన్న టీడీపీ మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీలు డి అంటే డి అన్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్సాహపరచటానికి టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ ఇంటలిజెన్స్ విభాగాన్ని పావుగా వాడుకుంటున్నారు. తాజా ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ హడావిడీ మొదలైంది. టీడీపీకి ఈ ఎన్నికల్లో 135 నుంచి 175 అసెంబ్లీ స్థానాలు వస్తాయంటూ హంగామా మొదలుపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏపీలో మళ్లీ ప్రజలు టీడీపీని కోరుకోవడానికి ప్రధాన కారణం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వృద్ధాప్య పెన్షన్ లు, నిరుద్యోగ భృతి వీటికి ఆకర్షితులైన రూరల్, అర్బన్ ప్రజలు మళ్లీ యునానిమస్‌గా టీడీపీనే కోరుకుంటున్నారన్నది ఏపీ- టీడీపీ ఇంటలిజెన్స్ వారి సర్వే.
ఈ మాటల్లోనే ఇదొక ఫేక్ సర్వే అని స్పష్టంగా తెలిసిపోతోంది. అందుకే ప్రతిపక్ష వైసీపీ బాబు కావాలని ఓటర్లని ప్రభావితం చేయాలని చేయించి ఇంటలిజెన్స్ సర్వే ఇదని చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇంటలిజెన్స్ విభాగాన్ని వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని హామీలు ప్రకటించిన ఎన్నికల ముందు ఆరు నెలలు ఎన్నికల తర్వాత మూడు నెలలు అన్న విధానాన్ని అవలంబిస్తున్న చంద్రబాబుకు తగిన విధంగా రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అని వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.